ఆరాను వ‌ద‌ల‌ని ర‌ష్మిక‌..అక్క‌డ‌కు కూడా తీసుకెళ్తుంద‌ట‌!

ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ ముద్దుగుమ్మ‌.. మొన్నీ మ‌ధ్య త‌న పెట్ డాగ్ ఆరాను అంద‌రికీ ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఎవరైనా ప్రేమలో పడటానికి మూడు సెకన్ల సమయం పడుతుంది. కానీ తాను మాత్రం కేవలం మూడు మిల్లీ సెకన్లలోనే ఆరాతో ప్రేమలో పడ్డానని కూడా చెప్పుకొచ్చింది. మొత్తానికి లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆరాకు బాగా ద‌గ్గరైన ర‌ష్మిక‌.. దానిని అస్స‌లు వ‌దిలి పెట్ట‌డం లేదు.

Rashmika Mandanna is now a pet parent, shares cute pics of pup Aura -  Movies News

మహారాష్ట్రలో షూటింగ్‌లు షూరు కావటంతో బెంగళూరు నుంచి ముంబై వెళ్లిన రష్మిక తనతో పాటు ఆరాను కూడా తీసుకెళ్లారు. అంతేకాదు, అమితాబ్ తో కలిసి గుడ్‌బై సినిమాలో నటిస్తురష్మిక.. ఆ సినిమా సెట్‌కు కూడా ఆరాను తీసుకెళ్లింద‌ట‌. సెట్‌లో అందరికీ తన కిడ్‌ను పరిచయం చేశా అంటూ తాజాగా ఇన్‌ స్టా స్టోరీలో షేర్ చేశారు రష్మిక.

Share post:

Popular