కూతురు విషయంలో కోహ్లీ కీలక నిర్ణయం..?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులకు ఆడపిల్ల జన్మించిన విషయం తెలిసిందే. వారి కూతురికి వామిక అనే పేరు పెట్టినట్లు కూడా అందరికీ తెలుసు. కానీ కోహ్లీ-అనుష్క దంపతుల కూతురు ఎలా ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు తమ కూతురు ఫోటోను కోహ్లీ కానీ అనుష్క కానీ షేర్ చేయలేదు. తాజాగా ఈ విషయంపై కోహ్లీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
కోహ్లి శనివారం తన ఫ్యాన్స్ తో ఇన్స్ స్టాగ్రామ్ లో చాట్ చేశాడు.

- Advertisement -

ప్రస్తుతం కోహ్లీ ముంబైలోని ఓ హోటల్‌ లో క్వారంటైన్‌ లో ఉన్నాడు. చాట్ లో భాగంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు కోహ్లీ రిప్లై ఇచ్చాడు. తాను లాస్ట్ టైమ్ గూగుల్ లో ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ట్రాన్స్‌ఫర్ గురించి సెర్చ్ చేసినట్లు తెలిపాడు. ఇక తన కూతురు వామిక పేరుకు అర్థమేంటి, ఆమె ఫొటోను ఎందుకు షేర్ చేయడం లేదు అని ఒక అభిమాని అడగ్గా.. దుర్గాదేవికి మరో పేరే వామిక, మా కూతురికి సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసే వరకూ ఆమె ఫొటోను మేము బయటపెట్టడానికి ఇష్ట పడట్లేదు అని కోహ్లి చెప్పాడు.

Share post:

Popular