ఆసుపత్రిలో చేరిన నటుడు విజయకాంత్..ఏం జ‌రిగిందంటే?

ప్రముఖ తమిళ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ‌కాంత్ ఆసుప‌త్రిలో చేరారు. ఈ ఉదయం శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విజ‌యకాంత్‌ను వెంట‌నే హుటాహుటిన కుటుంబ‌స‌భ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించారు.

అక్క‌డ ప్ర‌త్యేక డాక్ట‌ర్స్ బృందం విజ‌య్‌కాంత్ ఆరోగ్యాన్ని ప‌రీక్షిస్తున్నారు. ప్ర‌స్తుతం విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఒకటి రెండు రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అవుతారని, ఎవ‌రు ఆందోళ‌న చెందొద్ద‌ని డీఎండీకే వ‌ర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, గ‌త ఏడాది ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Share post:

Popular