ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ తనదైన స్టైల్ లో ఎప్పటికప్పుడు నూతనంగా వైవిధ్యమయిన చిత్రాలను తెరకెక్కిస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘అ..’ అనే థ్రిల్లర్ చిత్రం ఇంకా ‘ కల్కి ‘ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అందించి అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. ఆ తరువాత జాంబీ రెడ్డి చిత్రంతో సౌత్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు మొదటి సారిగా జాంబీ జోనర్ ను తీసుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రం బుల్లితెర పై కూడా రికార్డులు కొల్లగొటింది. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ తన నాలుగవ చిత్రాన్ని ప్రకటించడానికి రెడీ అయ్యారు. మే 29న ప్రశాంత్ వర్మ బర్త్ డే సందర్భంగా తన చిత్రానికి సంబందించిన మూవీ అప్డేట్ ప్రకటన అధికారికంగా వెల్లడించనున్నారు. మే 29న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు తమ చిత్రం అప్డేట్ ఉండబోతోందంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో హిమాలయాల పర్వతాలు కనిపించడంతో అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. చూడాలి మరి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో.

Share post:

Popular