మండ‌పంలో పెళ్లి..పురోహితుడు తెలివికి అంద‌రూ షాక్‌!

May 17, 2021 at 10:18 am

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎప్పుడూ చూడ‌ని, ఎన్న‌డూ జ‌ర‌గ‌ని చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ పురోహితుడు క‌రోనా నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు తెలివిగా కారులో ఉండే మంత్రాలు చ‌దివి.. మండ‌పంలో పెళ్లి తంతును ముగించాడు.

ఈ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా కోహెడ లో ఆదివారం చోటుచేసుకున్నది. కోహెడకు చెందిన సటికం భాగ్య- మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో స్థానిక మండ‌పంలో ఆదివారం జరిగింది.

అయితే పురోహితుడు ప్రసాద్‌రావు శర్మ.. ఈ జంట వివాహం జ‌రిపించేందుకు మండపానికి వచ్చారు. కానీ, క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా మండ‌పం బ‌య‌టే కారులో కూర్చుని మైక్ ద్వారా మంత్రాలు చ‌దివి మండ‌పంలో పెళ్లిని జ‌రిపించారు. ఇక పురోహితుడు తెలివికి షాక‌వ‌డం అక్క‌డున్న వారంద‌రి వంతు అయింది.

మండ‌పంలో పెళ్లి..పురోహితుడు తెలివికి అంద‌రూ షాక్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts