ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ స‌రికొత్త రికార్డు!

మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గ‌తంలో వ‌చ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్‌గా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఈ సిరీస్‌లో స‌మంత అక్కినేని రాజీ అనే ఉగ్రవాది పాత్ర పోషించింది.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుండ‌గా.. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. అయితే ఈ ట్రైల‌ర్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో 24 గంటల్లో.. 15 మిలియన్ల వ్యూస్, 500k లైక్స్‌ను సాధించింది. ఫ్యామిలీ మ్యాన్ 2 దెబ్బ‌కు మీర్జాపూర్ 2 రెండో స్థానంలోకి పడిపోయింది.