రెబ‌ల్ స్టార్‌పై క‌న్నేసిన లేడీ డైరెక్ట‌ర్‌..గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చేనా?\

లేడీ డైరెక్ట‌ర్ సుధ కొంగర.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆకాశం నీ హద్దురా(శూరరైపోట్రు) సినిమాను తెర‌కెక్కించి ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను సొంతం చేసుకుంది సుధ‌. దీంతో ఈమె త‌దుప‌రి చిత్రం ఏ హీరోతో చేయ‌బోతోందా అని అంద‌రూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజా సామాచారం ప్ర‌కారం.. సుధ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో చేసేందుకు సిద్ధం అవుతుంద‌ట‌. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ కూడా ప్రభాస్‌కు వినిపించ‌గా.. పూర్తి కథను సిద్ధం చేయాలని సూచించిన‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో సుధ పూర్తి క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ప్ర‌స్తుతం రాధేశ్యామ్‌, స‌లార్‌, ఆదిపురుష్ తో పాటు నాగ్ అశ్విన్‌తో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్నాడు ప్ర‌భాస్‌. మ‌రి ఇన్ని ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండ‌గా.. సుధ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇస్తాడా..లేదా..అన్న‌ది చూడాలి.

Share post:

Latest