ప్రభుదేవాపై శ్రీ‌రెడ్డి టార్గెట్..నాశ‌నం చేశాడంటూ షాకింగ్ కామెంట్స్‌!

సల్మాన్ ఖాన్, దిశా పటానీ జంట‌గా ప్రభుదేవా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం రాధే. ఈ చిత్రాన్ని ఈద్ పండ‌గ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ జీ 5లో విడుద‌ల చేశారు. భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది.

రొటిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా తెరకెక్కించాడని నెటిజన్స్ తమదైన రివ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంపై సంచలన తార శ్రీ రెడ్డి కూడా రివ్యూలో ఇచ్చింది. రాధే సినిమా గురించి వన్‌ లైన్ రివ్యూ అంటూ మొదలుపెట్టిన శ్రీ‌రెడ్డి..ప్ర‌భుదేవాను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

సినిమా చరిత్రలోనే రాధే చెత్త సినిమా అని చెప్పిన శ్రీ‌రెడ్డి.. సల్మాన్ ఖాన్ గొప్ప నటుడు అని కితాబిచ్చింది. కానీ ప్రభుదేవా సినిమాను నాశనం చేసేశాడ‌ని చెత్త డైరెక్షన్, వరస్ట్ స్టోరీ. ఇది ఒక డస్ట్ బిన్ ఛి ఛి అంటూ రాసుకొచ్చింది. దీంతో శ్రీ‌రెడ్డి పోస్ట్ కాస్త వైర‌ల్ గా మారింది.

Share post:

Latest