సింగ‌ర్ సునీత‌కు షాకిచ్చిన మందుబాబులు..ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ టాప్ సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ సునీత గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వ్యాపారవేత్త రామ్‌ వీరపనేని ఇటీవ‌లె రెండో వివాహం చేసుకున్న సునీత‌.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గత మూడు రోజుల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ఇన్ స్టాగ్రాంలో లైవ్ సెషన్ పెట్టేస్తున్నారు.

ఈ లైవ్ సెష‌న్‌లో త‌న ఫాలోవ‌ర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డం, వారు ఆడిగిన పాట‌లు పాడ‌టం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా తెలంగాణలో లాక్‌డౌన్ అంశంపై కూడా స్పందించారు సునీత‌. ఆమె మాట్లాడుతూ.. ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. లాక్‌డౌన్‌ అనగానే అందరూ నిత్యవసర సరుకులు కోసం ప‌రుగులు పెట్టారు.

అయితే బాధాక‌రం విష‌యం ఏంటంటే.. వైన్‌ షాపుల ముందు కూడా జనాలు బారులు తీరారు. ఇది నేను ఊహించలేదు. లాక్‌డౌన్‌ కారణంగా సమాజంలో కొంత మార్పు వస్తుందని అభిప్రాపడ్డా. కానీ ఈ సంఘటనను చూసి షాక్‌కు గురయ్యా అంటూ ఆమె లైవ్‌లో చెప్పుకొచ్చారు. మొత్తానికి మందుబాబులు అలా సునీత‌కు షాకిచ్చారు.

Share post:

Popular