క‌మ‌ల్ ఓట‌మిపై శ్రుతి హాస‌న్ ఎలా స్పందించిందంటే?

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్ మక్కల్‌ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నికల బ‌రిలో దిగారు. కానీ, క‌మ‌ల్‌కు ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా త‌మిళులు ఇవ్వ‌లేదు. కమల్ నేతృత్వంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేసిన 142 స్థానాల్లోనూ ఓడిపోయారు.

- Advertisement -

ఇక కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ ‌(బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ కమల్‌హాసన్ ఓడిపోయారు. అయితే తండ్రి ఓట‌మిపై కూతురు శ్రుతి హాస‌న్ సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది.

తన తండ్రిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటూ తన ట్విటర్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారు. దానికి ఎంఎన్‌ఎం ఎన్నికల చిహ్నమైన టార్చిలైటు చేతపట్టుకుని వున్న తన తండ్రి ఫొటోను ఆమె పోస్టు చేశారు.

Share post:

Popular