నెగెటివ్ టాక్‌తోనే రూ.100 కోట్లు రాబ‌ట్టిన `రాధే`?

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం రాధే. ఈ చిత్రంలోనూ స‌ల్మాన్‌కు జోడీగా దిశా పటానీ న‌టించింది. ఈ చిత్రాన్ని భారీ అంచ‌నాల న‌డుము ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ ప్లెక్స్ లో మే 13న విడుద‌ల చేశారు.

- Advertisement -

అయితే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం స‌ల్మాన్ అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచింది. రొటిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా తెరకెక్కించాడని నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు మండి ప‌డుతున్నారు. అయితే నెగెటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ మొద‌టి రోజు ఈ చిత్రం రూ.100 కోట్లు రాబ‌ట్టింది.

జీ ప్లెక్స్ లో రాధే సినిమాను పే ఫర్ వ్యూ పద్ధతిలో రూ.249 రేటుకు స్ట్రీమ్ చేశారు. విడుదలై 24 గంటలు కూడ గడవకముందే 42 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చూసుకుంది ఈ చిత్రం. అంటే 42 లక్షల మందితో 249 రూపాయలు వెచ్చిస్తే.. వసూళ్లు 104 కోట్లకు పైగానే రాబ‌ట్టిన‌ట్టు అవుతుంది. ఇక విదేశీ మార్కెట్ల నుంచి రూ.5 కోట్ల మేర వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

Share post:

Popular