కేజీఎఫ్ 2లో రావు రమేష్ పాత్ర అదేన‌ట‌!

కోలీవుడ్ రాక్ స్టార్ హీరో య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్‌2. 2018లో బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా.

హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ భారీ బ‌డ్జెట్‌ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్ కూడా న‌టించాడు. ఇక నేడు రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయ‌న పాత్రేంటో తెలుపుతూ ఓ స్పెషల్ మ్యాగజైన్ ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో రావు ర‌మేష్ కన్నెగంటి రాఘవన్ అనే పాత్ర చేస్తున్నాడు. ఆయ‌న ఒక సిబిఐ ఆఫీసర్ గా రాకీ కేసును డీల్ చేసే స్పెషల్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అలాగే సిబిఐ ఇంట్రెస్ట్ కేజీయఫ్ పై ఉందా లేక దాన్ని ఆధీనంలోకి తీసుకున్న రాకీ పై ఉందా అన్న మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా రైస్ చేశారు. ప్ర‌స్తుతం ఈ మ్యాగ‌జైన్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://twitter.com/hombalefilms/status/1397047153109868546?s=20