రాకేష్ మాస్టర్ ఇంటిపై దాడి..!?

టాలీవుడ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్ అయిన రాకేష్ మాస్టర్ అటు ఇండస్ట్రీలో ఇంకా బయట కూడా ముక్కుసూటి మనిషి అని పేరు ఉంది ఆయనకి. వాటి వల్లే తరచు వివాదాలలో చిక్కుకుంటారు రాకేష్ మాస్టర్. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో శ్రీ కృష్ణుడి పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఆయన పై కేసు నమోదు అయింది. 9 నెలలకి ముందు ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో యాదవుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడి పై వ్యాఖ్యలు చేశాడు రాకేష్ మాస్టర్.

అది కాస్తా వివాదానికి దారితీసింది. శ్రీకృష్ణుడి పై వ్యాఖ్యలు చేసి, తమని కించ పరిచారంటూ యాదవ హక్కుల పోరాట సమితి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా శ్రీ కృష్ణ నగర్ లో ఉంటున్న రాకేష్ మాస్టర్ ఇంటికి ఆదివారం సాయంత్రం 5:30 కు సాయి యాదవ్, ఇమ్రాన్ ప్రవేశించి రాకేష్ మాస్టర్ ని దూషించడంతో పాటు ఆయన ఇంటి కిటికీలను కూడా ధ్వంసం చేశారు.

Share post:

Popular