`అఖండ` ఫస్ట్ సింగిల్‌కు రంగం సిద్ధం..?!

May 4, 2021 at 1:13 pm

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా ప్రగ్యా జైస్వాల్ న‌టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది.

ఇటీవల వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్ రాబోతోంద‌ట‌. ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ ఫ‌స్ట్ సింగిల్‌కు రంగం సిద్ధం చేస్తున్నార‌ని.. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్పటికే థమన్ ఇచ్చిన అవుట్ స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి. కాగా, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, క‌రోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది.

`అఖండ` ఫస్ట్ సింగిల్‌కు రంగం సిద్ధం..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts