ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్స్ కలిసిన వేళ : విష్ణు

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఇప్పటికీ వారు తమ స్నేహ బంధాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత తన ప్రాణ స్నేహితుడు మోహన్ బాబు ఇంట్లో రెండు రోజులు అతిథిగా ఉన్నారు. వైట్ అండ్ వైట్ కలర్ డ్రెస్‌లో పాపారాయుడుతో పెదరాయుడు అదేనండి మోహన్ బాబుతో రజినీకాంత్ ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.

రజినీకాంత్‌తో మోహన్ బాబు కలిసి ఉన్న ఫోటోలను మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇక మంచు వీళ్లిద్దరు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ కలిసిన వేళ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. వైట్ అండ్ వైట్ కలర్ డ్రెస్‌లో మోహన్ బాబుతో రజినీకాంత్ ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. రజినీ మంచు ఫ్యామిలీతో గడిపిన రెండు రోజులు అందరూ ఫోటోలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ర‌జ‌నీకాంత్‌తో ఫొటోలు దిగడంతో అవి ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.