గ్లోబ‌ల్ బ్యూటీ భ‌ర్త‌కు ప్ర‌మాదం..?

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా భ‌ర్త‌, హాలీవుడ్ గాయ‌కుడు నిక్ జోనాస్‌ కు ప్రమాదానికి గురయ్యారు. శ‌నివారం రాత్రి షూటింగ్ సెట్‌ లో ఆయనకు ప్ర‌మాదం జరిగింది. దీంతో వెంటనే నిక్ జోనాస్‌ ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే నిక్ జోనాస్‌ కు పెద్ద‌ గాయాలేవి కాలేదు. డాక్టర్లు చిన్న పాటి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సోమ‌వారం నిక్ త‌న రియాలిటీ షో ది వాయిస్‌ లో పాల్గొన‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రియాంక లండ‌న్‌లో ఉంది. నిక్ లాస్ ఏంజెల్స్‌ లో ఉన్నారు.

నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా 2018లో వివాహంచేసుకున్నారు. ఇటీవ‌ల ప్రియాంక చోప్రా త‌న ఆటోబయోగ్రఫీ ‘అన్‌ఫినిష్డ్’ పుస్త‌కాన్ని విడుదల చేసిన విష‌యం తెలిసిందే. మార్కెట్‌లో విడుద‌లైన వారంలోపే ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్స్ జాబితాలో చేరింది. వివాహం తర్వాత ఈ జంట చాలాసార్లు వార్తల్లో నిలిచింది. నిక్ తో పెళ్లి విషయంలో తన తల్లి అయిన మధు చోప్రా ఎంతో కీలక పాత్ర పోషించిందని ఈ పుస్తకంలో ప్రియాంక తెలిపింది. ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న నటిగా రికార్డులకు ఎక్కింది.

Share post:

Latest