క‌రోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న ప్ర‌భాస్‌..ఆందోళ‌నలో ఫ్యాన్స్‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో నిర్మిత‌మ‌వుతోంది. రామాయణ మహాకావ్యం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

ఇక రావణాసుడి పాత్ర బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ కాగా.. అక్క‌డే రెండో షెడ్యూల్ కూడా ముగిసింది. మూడో షెడ్యూల్‌ను కూడా అక్కడే చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్స్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ఆదిపురుష్‌ తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరిపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఇక ఇప్ప‌టికే షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయ‌ని..ఈ నెల 15 నుంచి త‌దుప‌రి షెడ్యూల్ స్టార్ట్ కానుంద‌ని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ప్ర‌భాస్‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రిక‌రించ‌నున్నారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ఎక్క‌డిక‌క్క‌డ కోర‌లు చాస్తోంది. సెల‌బ్రెటీలు కూడా వ‌ర‌స‌గా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇలాంటి త‌రుణంలో ప్ర‌భాస్ రిస్క్ చేసి షూటింగ్ చేయ‌డం ఎందుకని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

Share post:

Latest