తండ్రికి తగ్గ తనయుడు అకీరా..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కరిద్దరు మినహా మిగతావారు హీరోగా రాణిస్తున్నారు. అయితే చాలా మంది మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడూ సినిమాల్లోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. సాధారణంగా అకీరా చాలా ఎత్తుగా, అందంగా ఉంటాడు. అతడికి హీరో అయ్యే పర్సనాలిటీ ఉంది. తాజాగా అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కొడుకు కావడంతో అకీరాకు ఇప్పటినుంచే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

తాజాగా ట్రెండ్ అవుతున్న ఫొటోల్లో పవన్ కళ్యాణ్ పక్కన అకీరా నిల్చొని ఉన్నాడు. అతడు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఎత్తు ఉండటం గమనార్హం. దీంతో హైట్ లో అప్పుడే పవన్ కళ్యాణ్ ను మించిపోయాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అకీరా 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్నాడని సమాచారం. ఈ ఫోటో అకీరాను పవన్ కళ్యాణ్ మ్యూజిక్ క్లాస్ కు తీసుకెళ్లినప్పుడు తీసిన ఫోటో కావొచ్చని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అకిరా నందన్ ఇదివరకే మరాఠీలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమా చేశాడు. ఆ సినిమాను అతని తల్లి రేణు దేశాయ్ తెరకెక్కించారు. ఇక అకీరా టాలీవుడ్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest