ఎన్టీఆర్ బ‌ర్త్‌డే నాడు రానున్న కొత్త సినిమా టైటిల్?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో నిర్మించబోతున్నాయి. ఇంకా ఈ సినిమా టైటిల్ ప్ర‌క‌టించ‌లేదు. అయితే రేపు(మే 20) ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వాల‌ని కొర‌టాల భావిస్తున్నార‌ట‌.

ఇందులో భాగంగానే రేపు టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌నున్నారట‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇక మ‌రోవైపు ఆర్ఆర్ఆర్ నుంచి కూడా ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది.

Share post:

Latest