క‌రోనా బాధితుల కోసం ముందుకొచ్చిన ఇస్మార్ట్ పోరి!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్ రూపంలో దేశాన్ని క‌క‌లావిక‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. త‌మిళ‌నాడులోనూ క‌రోనా వీర విహారం చేస్తోంది.

ఈ క్ర‌మంలోనే క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు దాత‌లు ముందుకు రావాల‌ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునివ్వ‌గా.. సూర్య ఫ్యామిలీ, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్, హీరో అజిత్, ర‌జ‌నీకాంత్‌, ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య ఇలా ప‌లువురు తోచినంత విరాళాలు అందించారు.

తాజాగా ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో సూప‌ర్ పాపుల‌ర్ అయిన ఇస్మార్ట్ పోరి నిధి అగ‌ర్వాల్ కూడా క‌రోనా బాధితుల కోసం ముందుకొచ్చింది. తమిళ నాడు సీఎం రిలీజ్ ఫండ్‌కు రూ. లక్ష ప్రకటించారు. అంతేకాదు దేశంలో ఖాళీగా ఉన్న కోవిడ్ పడకల సమాచారాన్ని ఫైండ్ ఏ బెడ్ పేరుతో తెలుసుకునేందుకు కాజ్ అంబాసిడర్‌గా నిధి ప్రచార సాయం కూడా చేస్తున్నారు.

Share post:

Latest