ఊహించ‌ని డైరెక్ట‌ర్‌తో వెంకీ కొత్త ప్రాజెక్ట్‌..?!

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోల్లో విక్ట‌రీ వెంకటేష్ ఒక‌రు. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ యంగ్ హీరోల‌కు పోటీ ఇస్తూ వ‌రుస సినిమాలు చేస్తున్నాడు వెంకీ. అంతేకాదు, వ‌రుస హిట్ల‌కు కూడా ఖాతాలో వేసుకుంటున్నారు.

ప్ర‌స్తుతం నార‌ప్ప‌, ఎఫ్ 3, దృశ్యం 2 చిత్రాలు చేస్తున్న వెంకీ.. త్వ‌ర‌లోనే ఎవ‌రూ ఊహించ‌ని ఓ యంగ్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కేరాఫ్‌ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో దర్శకుడిగా త‌న మార్క్ చూపించిన‌ వెంకటేష్‌ మహా.. ఇటీవ‌ల వెంకీకి ఓ క‌థ చెప్పాడ‌ట‌.

కుటుంబ బంధాలకు నవ్యమైన అంశాల్ని మేళవిస్తూ అతడు చెప్పిన క‌థ వెంకీకి బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని.. ఈ చిత్రాన్ని కూడా సురేష్‌ ప్రొడక్షన్స్ సంస్థే నిర్మించ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నార‌ట‌.