మే నెలలో ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సినిమాలు ఇవే..!

దాదాపుగా కరోనా ప్రభావం అన్ని రంగాల పై చుపెడుతుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు అన్ని ఓటీటీ వేదికగా విడుదల అవుతున్నాయి. థియేటర్లు మూతపడే సరికి కొన్ని సినిమాలకు ఓటీటీనే ప్రత్యామ్నయంగా మారాయి. ఈ నెలలో ఏయే చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి ఇక్కడ చూద్దాం. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన బట్టల రామస్వామి బయోపిక్ మూవీ డైరెక్ట్ డిజిటల్ విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా జీ 5లో మే 14 న రిలీజ్ కాబోతుంది. అలాగే అందాల భామ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ నవంబర్‌ స్టోరీ చిత్రం మే 20న డిస్నీ+ హాట్‌స్టార్ లో రిలీజ్ కానుంది.

ప్రవీణ్‌ కండ్రిగుల దర్శకుడిగా ఇండస్ట్రీకి అడుగుపెడుతున్న సినిమా బండి మే 14 న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. అలాగే వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన మూవీ డి-కంపెనీ.ఈ మూవీ మే 15న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ స్పార్క్‌లో స్ట్రీమ్ కానుంది. కార్తీక్‌ రాపోలు దర్శకుడిగా ఏక్‌ మినీ కథ తో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను ప్రముఖ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ ఈ మూవీ హక్కులను దక్కించుకోవాలని చూస్తుంది. అలాగే రానా దగ్గుబాటి నటించిన అరణ్య మూవీ మే 14 లేదా మే చివరి వారంలో జీ 5లో ప్రసారం అవుతుందని సమాచారం.

Share post:

Popular