అర‌రే..ఆ యాప్‌తో అడ్డంగా బుక్కైన రాజ‌మౌళి తండ్రి?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా అద్భుత‌మైన కథలను అందిస్తూ.. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా కొన‌సాగుతున్నారీయ‌న‌.

ఇదిలా ఉంటే ఇటీవ‌ల ఆలీతో స‌ర‌ద‌గా అనే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.. త‌న‌కు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ అంటే ఇష్ట‌మ‌ని.. తన‌ మొబైల్ స్క్రీన్ వాల్ పేప‌ర్‌పై కూడా పూరీ ఫొటోనే ఉంటుంద‌ని అంద‌రికీ చూపించిన సంగ‌తి తెలిసిందే. అయితే విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇక్క‌డే అడ్డంగా బుక్కైయ్యారు.

నా ఫోన్‌లో ఉన్న వాల్ పేపర్ చూడండి అని విజయేంద్రప్రసాద్ ఫోన్ చూపించ‌గా.. ఆయన మొబైల్‌లో ప్లే ఇట్ అనే యాప్ కూడా ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపించింది. ప్లే ఇట్ అనేది ఓ పైర‌సీ యాప్‌. ఇంకేముంది.. రాజమౌళి గారి ఫాదర్ కూడా పైరసీ యాస్ యూజ్ చేస్తున్నార్రోయ్ అంటూ మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు నెటిజ‌న్లు.