నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు అరియానా ఆస‌క్తిక‌ర స‌మాధానం…?

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయి ఆర్టిస్టులంద‌రు తమ ఇళ్లకు పరిమితం అయిపోయారు. ఎల్లప్పుడూ ఎంతో బిజీగా సాగే ఆర్టిస్టులంద‌రికి ఇప్పుడు కొంత స‌మ‌యం దొరకడంతో తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. దీంతో సోష‌ల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తమ ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తూ సమయం గడుపుతున్నారు.

ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ అరియానా కూడా నెటిజ‌న్స్ తో చాట్ చెయ్యగా ఓ నెటిజ‌న్ తన వాట్సాప్ నెంబ‌ర్ అడిగాడు. దానితో నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు అరియానా గమ్మత్తుగా జవ్వాబు ఇచ్చింది. నా వాట్సప్ నంబర్ ఇవ్వాలని ఉన్నా కూడా ఇంట్లో వాళ్లకు తెలిస్తే నన్ను చంపేస్తారు కాబ్బటి నేను ఇవ్వలేను అంటూ తెలివిగా స‌మాధానం చెప్పింది. బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ పొందిన అరియానాకు బుల్లితెర, వెండితెర నుండి వ‌రుస అవ‌కాశాలు లభిస్తున్నాయి.

Share post:

Popular