సోనుసూద్ కి నోటీసులు..?

Sonu Sood

ప్రస్తుతం నడుస్తున్న కరోనా విపత్తు సమయంలో ప్రజలకు అండగా పలువురు సెలెబ్రిటీలు చేస్తున్న సహాయ కార్యక్రమాల పై ముంబై హైకోర్టు విచారణ చెప్పట్టాలని ఆదేశించింది. కొందరు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినీ తారలు వంటి వారు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్నట్టు తెలిసిందే. దీని పై ముంబై హైకోర్టు వారికీ అసలు ఈ కోవిడ్ డ్రగ్స్ ఎక్కడి నుండి లభిస్తున్నాయంటూ వారిని ప్రశ్నించింది. వారికీ కోవిడ్ డ్రగ్స్ ఎలా లభిస్తున్నాయో వెంటనే వివరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ముంబై హైకోర్టు ఆదేశించింది. ఇంకా కోవిడ్ డ్రగ్స్ సరఫరా పై పూర్తి హక్కు కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని హైకోర్టు వారికీ గుర్తు చేసింది.

ఈ తరుణంలో ఇప్పటికే ప్రభుత్వం ముంబై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ, సోనూసూద్ చారిటీ ఫౌండేషన్ ఇంకా పలువురు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. కొందరు ఉత్పత్తి కేంద్రాల నుంచి కోవిడ్ డ్రగ్స్ తీసుకోగా, ఇంకొందరు దాతృత్వంతో కోవిడ్ డ్రగ్స్ ఇస్తున్నట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ అసలు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కోవిడ్ డ్రగ్స్ వారికీ ఎలా లభించాయని కోర్టు ప్రశ్నించింది. రెమ్డెసివిర్ సంస్థలను కోర్ట్ ప్రశ్నించగా.. వారు ఏ సెలబ్రిటీలకు డ్రగ్ సరఫరా చేయలేదని కోర్టుకి తెలిపారు. ఈ విషయం పై శివసేన ప్రభుత్వం మరికొంత విచారణ చెప్పటనుంది.