వైరల్ అవుతున్న నాజర్ న్యూ లుక్.. ?

టాలీవుడ్ లో వస్తున్న చిన్న సినిమాల్లో కంటెంట్ బాగుంటుంది. హీరో ఎవరనే సంబంధం లేకుండా కంటెంట్ పై నమ్మకంతోనే సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలు పేరుతో పాటు లాభాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. తాజాగా అడవిలో జరిగిన సంఘటనల ఆధారంగా “నల్లమల” అనే ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. రవిచరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమిత్ తివారి, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ఎం నిర్మిస్తున్నారు. నాజర్, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సిద్ శ్రీరామ్ పాడిన ఏమున్నవే పిల్ల పాట పెద్ద హిట్ అయ్యింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ సీనియర్ నటుడు నాజర్ కొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఓ ప్రముఖ శాస్త్రవేత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నల్లమల అడవుల గురించి చూపించబోతున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

Share post:

Latest