సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు..?

ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నేడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు ఒకరిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. హైద‌రాబాద్‌లో నివసిస్తున్న సిద్ధార్ధ పితానిని పోలీసులు అరెస్టు చేసారు. సుశాంత మృతి కేసులో డ్ర‌గ్స్ విషయం పై ఎన్సీబీ విచార‌ణ చేపట్టిన విష‌యం అందరికి తెలిసిందే. గ‌త సంవత్సరం జూన్ 14వ తారీఖున బాంద్రాలోని త‌న ఇంట్లో అనుమానాస్ప‌ద స్థితిలో నటుడు సుశాంత్ మృతి చెందాడు.

ఈ కేసు విషయంలో సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ అయిన రియా చ‌క్ర‌వ‌ర్తిని ఎన్సీబీ అరెస్టు చేసి విడుదల చేశారు. సుశాంత్‌కు డ్ర‌గ్స్ పంపిణి చేసిన మాఫియాను కనిపెట్టేందుకు ఎన్సీబీ ప్ర‌య‌త్నాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. హీరో సుశాంత్‌కు సిద్ధార్ధ పితాని మంచి ఫ్రెండ్‌. ఇద్ద‌రూ క‌లిసి ఒకే అపార్ట్మెంట్ లో నివసించేవారు. డ్ర‌గ్స్ విషయం పై సిద్ధార్థ‌ను విచార‌ణ కోసం హైదరాబాద్ నుండి ముంబైకి తీసుకువెళ్ల‌నున్నారు పోలీసులు. బాంద్రా అపార్టుమెంట్లో సుశాంత్ మృత‌ దేహాన్ని మొట్ట మొదట చూసింది కూడా తన స్నేహితుడు సిద్ధార్థ‌నే.