ఓటీటీపై దృష్టి పెట్టిన బాలయ్య భామ..?

ప్రస్తుతం ఉన్న క‌రోనా శంక్షోభం వల్ల డిజిట‌ల్ ప్లాట్ఫారం కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రేక్షకులు టైం పాస్ కోసం ఎక్కువగా ఓటీటీనే ఆశ్ర‌యిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్ర‌ముఖులు కొత్త ఓటీటీ సంస్థ‌లు ప్రారంభించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. తెలుగులో ఇప్ప‌టికే ఆహా అనే సరికొత్త ఓటీటీ ప్లాట్ ఫాంన్‌ను అల్లు అర‌వింద్ మొదలు పెట్టగ, త్వ‌ర‌లో నాగార్జున కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టనున్నారు అని వార్తాలు వస్తున్నాయి.

ఇకపోతే ఇప్పుడు అందాల బొద్దు గుమ్మ న‌మిత కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టేందుకు రెడీ అయిందట. రవివర్మ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో కలిసి ప్రారంభిస్తున్నట్టు సమాచారం. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు నమిత టాకీస్‌ అని పేరు ఫిక్స్ చేయనున్నారు. కాబ్బటి త్వరలోనే న‌మిత ఈ ఓటీటీ ద్వారా కొత్త కాన్సెప్ట్‌తో కూడిన మూవీస్సి ఇంకా సిరీస్లను ప్రేక్ష‌కుల అలరించేందుకు తీసుకురానున్న‌ట్టు ఆమె తెలిపారు.

Share post:

Popular