కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో.. ఆ పాత్ర ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కబోతోంది.
పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనునుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణతో పాటు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది.
విషయం ఏంటంటే.. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నాగార్జున కొడుకుగా నాగ చైతన్య… ఆయన తనయుడిగా అఖిల్ కనిపిస్తారట. అయితే తెరపై చైతూ పాత్ర చాలా చిన్నగా ఉంటుందట. ఇక కథ అంతా కూడా తాత నాగ్ – మనవడు అఖిల్ మధ్య నడుస్తుందని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.