లీకైన నాగ‌చైత‌న్య `థ్యాంక్యూ` స్టోరీ..నెట్టింట్లో వైర‌ల్‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, విక్రమ్ కె కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `థ్యాంక్యూ`. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండ‌నున్నార‌ట‌. అయితే తాజాగా థ్యాంక్యూ స్టోరీ ఇదేనంటూ నెట్టింట్లో ఓ వార్త వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఎన్నారై బిజినెస్ మెన్ అయిన హీరో తన పుట్టుక మూలాలు ఇండియాలో ఉన్నాయని తెలుసుకుంటాడు.

ఇండియాలో తన కుటుంబ సభ్యులను వెదికేందుకు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న అనుభవాల సారాంశమే ఈ సినిమా అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి థ్యాంక్యూ స్టోరీ ఇదేనా.. కాదా.. అన్న‌ది తెలియాలంటే విడుద‌ల అయ్యే వ‌ర‌కు ఆగాల్సిందే.

Share post:

Latest