వామ్మో: చై – సామ్ ల ఆస్తుల విలువ అంతనా..?!

టాలీవుడ్ బెస్ట్ జంటల్లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. వీరు ప్రేమించి వివాహం ఆడి ఇప్పుడు అటు వృత్తిపరంగా, ఇంకా తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ రాణిస్తున్నారు. వివాహం అనంతరం ఇద్దరూ వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం చై-సామ్‌ల జంట సంపాదన సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సమంత ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. గత పదేళ్లగా సినిమాలు చేస్తున్న సమంత బాగానే ఆస్తులను కూడబెట్టిందట. ప్రస్తుతం సామ్ ఆస్తుల విలువ దాదాపు 85 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే ఆమెకి రెండు స్టార్టప్‌లను ఉన్నాయి.

వాటిలో ఒకటి ఏకామ్‌ అనే ఫ్రీ స్కూల్‌, మరొకటి ఫ్యాషన్‌ లేబుల్‌ సాకి. వీటి ద్వారా కూడా సంపాదిస్తుంది సమంత. అటు నాగ చైతన్య కూడా వరుస మూవీస్ తో బాగా సంపాదిస్తున్నాడు. సినీ కెరీర్‌లోనే ఆయన రూ.40 కోట్ల వరకు సంపాదించినట్లు అంచనా. వెళ్లిదరికి కాస్టలీ కార్లు, విలాసవంతమయిన బంగ్లాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ జంట సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల విలువ రూ.125కోట్ల వరకు ఉంటుందని సినీ పండితుల అంచనా.

Share post:

Latest