మరోసారి ‘ కింగ్ ఆఫ్ క్లే ‘ గా నిరూపించుకున్న నాదల్..!

టెన్నిస్ దిగ్గజం ఆటగాడు రాఫెల్ నాదల్ మరోసారి తాను ‘కింగ్ ఆఫ్ క్లే’ గా నిరూపించుకున్నాడు. తాజాగా ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో రెండు గంటల 49 నిమిషాల పాటు ప్రపంచ నెంబర్ వన్ టాప్ సీడ్ ఆటగాడైనా నోవాక్ జో కోవి చ్ పై 7-5, 1-6, 6-3 తో గెలుపొందాడు. ఇది నాదల్ కెరీర్ లో మొత్తంగా 88వ సింగిల్ టైటిల్.

- Advertisement -

అత్యధికంగా 12 వ సారి ఫైనల్ కు చేరిన నాదల్ కి ఇది 10 వ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. ఇదివరకు ఈ స్పెయిన్ బుల్ వరుసగా 2005, 2006, 2007, 2009, 2010, 2012, 2013, 2018, 2019 విజయం సాధించిన తాజాగా మరో విజయంతో మొత్తంగా పదవ సారి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. దీంతో విజేత నాదల్ కు ప్రైజ్ మనీ గా రూ. రెండు కోట్ల 18 లక్షలతో పాటు.. 1000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. అలాగే రన్నరప్ గా నిలిచిన జొకోవిచ్ కి రూ. కోటి 29 లక్షలతో పాటు.. 600 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.

Share post:

Popular