కరోనా బారీన పడిన మరో ఎమ్మెల్యే..!

ఏపీలో కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోవడం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. తనతో తిరిగిన కార్యకర్తలు, అభిమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఐదు రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కరోనా టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజాప్రతినిధులకు ఇలా కరోనా రావడం పట్ల అభిమానులు, కార్యకర్తలో భయాందోలనలు పెరిగాయి. సాధ్యమైనంత వరకూ ఇళ్ల వద్దే ఉంటూ కరోనాను అంతం చేయాలని, కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే టెస్టులు చేసుకోవాలని పోలీసులు సూచనలు చేశారు

Share post:

Popular