`మేజర్` సినిమా విడుదల వాయిదా..?

26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో టెర్రరిస్ట్ లను తుదిముట్టించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా “మేజర్”. ఈ సినిమాలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఈ సినిమా హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని వివిధ దశలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా.. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ సహకారంతో నిర్మిస్తోంది. అడవి శేష్ ఈ సినిమాకు కథతో పాటు స్క్రీన్ ప్లే అందించారు.

ఈ సినిమాతో అడివి శేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను ను జూలై 2 న విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.

Share post:

Latest