క్రికెట్ కోచ్‌గా మార‌బోతున్న మ‌హేష్..నెట్టింట్లో న్యూస్ వైర‌ల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ సినిమా చేయ‌నున్నాడు.

ఆ త‌ర్వాత మ‌హేష్ త‌న‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఇటీవ‌ల ప్ర‌క‌టించాడు. అయితే ఈ సినిమా సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. అనిల్ తెర‌కెక్కించ‌బోయే ఈ చిత్రంలో మ‌హేష్ ఓ క్రికెట్ కోచ్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథే అయినా.. అనిల్ రావిపూడి మార్క్ వినోదమే ఉంటుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

Share post:

Popular