గెట్ రెడీ..వీరమల్లు నుండి రానున్న బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌స్తుతం క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహార వీర‌మ‌ల్లు చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రం నుంచి త్వ‌ర‌లోనే బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్ రానున్నాయి. ఈ సినిమా టీజర్‌ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న రిలీజ్ చేసే ప్లాన్స్ జరుగుతున్నాయ‌ని గ‌త రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే అంతకంటే ముందు ఈ చిత్రం నుంచి మ‌రో ట్రీట్ రానుంద‌ట‌. ఆగష్టు 17న నిధి అగ‌ర్వాల్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా వీర‌మ‌ల్లు నుంచి ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. కాగా, ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది.

Share post:

Latest