బిగ్‌బాస్ ప్రియుల‌కు బిగ్ షాక్‌..ఇప్ప‌ట్లో షో లేన‌ట్టేన‌ట‌?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా గ‌తేడాది ఆల‌స్యంగా ఈ షో ప్రారంభం అయిన‌ప్ప‌టికీ.. ఏ మాత్రం క్రేజ్ ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం ఐదో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

ఇక ఈసారి చాలా ముందుగానే షో ను నిర్వహించాలని భావించారు. మే లేదా జూన్ నుండి షో ను ప్రారంభించాల‌ని బిగ్ బాస్ నిర్వాహ‌కులు ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేశారు. కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ షో ఇప్పట్లో లెన‌ట్టే అని అంటున్నారు.

ప్ర‌స్తుతం క‌రోనా సెకెండ్ వేవ్‌లో వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో షోను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం సాధ్యమ‌య్యే ప‌ని కాదు. అందుకే సీజ‌న్ 5ను ఇప్ప‌ట్లో కాకుండా.. సెప్టెంబ‌ర్‌ నుండి మొదలుపెట్టే ఆలోచ‌న‌ల్లో ఉన్నార‌ట‌.

Share post:

Popular