బేబమ్మకు పోటీగా కేతిక.. నిజమేమిటంటే?

టాలీవుడ్ లో హీరోయిన్ల హవా నడుస్తోంది. ఈ మధ్య వచ్చిన ఇద్దరు హీరోయిన్ల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. వారెవరో కాదు..ఉప్పెన సినిమాతో పరిచయమైన కృతిశెట్టి, కేతిక శర్మ. ఉప్పెన సినిమాలో కృతిశెట్టి తన అందంతో, హావభావాలతో ఆకట్టుకుంది. కేతిక శర్మ కూడా పూరీ జగన్నాధ్ కొడుకుతో నటించి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సాధారణంగా హీరోయిన్ల మధ్య పోటీలు అనేవి మామూలే. గత సీజన్ లో చూస్తే పూజా హెగ్దే, రష్మిక మధ్య గట్టి పోటీయే నెలకొంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య పోటీ జరుగుతోందని టాలీవుడ్ టాక్.

అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. రొమాంటిక్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది కేతిక శర్మ. నాగశౌర్య సినిమాలో నటిస్తూనే ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. దీంతో కొత్త హీరోయిన్లను తీసుకోవాలనుకున్నప్పుడు వీరిద్దరి గురించే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి. వస్తున్న అవకాశాల వల్ల వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా మారుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరిలో ఎవరు స్టార్ హీరోయిన్ అవుతారో వేచి చూడాల్సిందే.

Share post:

Popular