అలా అడిగితే.. కృతి అస్స‌లు ఒప్పుకోవ‌డం లేద‌ట‌?!

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకోవ‌డంతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల మదిని గెలుచుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఎలాగైనా కృతితో సినిమా చేసేందుకు పలువురు హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

అయితే సినిమాల ఎంపిక‌లో కృతిశెట్టి మాత్రం చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. వ‌చ్చిన ప్రాజెక్టున‌ల్లా ఒప్పేసుకోకుండా.. సినిమా క‌థ‌, త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త, రెమ్యున‌రేష‌న్ ఇలా అన్ని విష‌యాలు త‌న న‌చ్చితేనే సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇస్తుంద‌ట‌

ఇక సెకండ్ హీరోయిన్‌గా చేయాలనో, గెస్ట్ రోల్‌ చేయాల‌నో ఎవ‌రైనా అడిగితే.. కృతి అస్స‌లు ఒప్పుకోవ‌డం లేద‌ట‌. ఏ మాత్రం మొహ‌మాట‌ప‌డ‌కుండా నో చెప్పేస్తుంద‌ట‌. కాగా, కృతి ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న‌ శ్యామ్‌సింగరాయ్‌, సుధీర్ బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది.

Share post:

Latest