బాలీవుడ్ బ్యూటీకి మరో యాప్ స్వాగతం..?

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌కు సామాజిక మాధ్యమ వేదిక కూ యాప్ సాదరంగా ఆహ్వానం పలికింది. స్వేచ్ఛగా ఆమె భావాలను వ్యక్త పరిచేందుకు ఈ వేదికను ఆమె ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. ట్విటర్ ఆమె ఖాతాను శాశ్వతంగా నిలిపివేసిన క్రమంలో కూ యాప్ ఆమెను ఆహ్వానించింది. కూ యాప్ దేశీయంగా అభివృద్ధి చెందింది. తమ వేదిక స్వేచ్ఛగా అభిప్రాయాలను తెలిపేలా అవకాశం కల్పిస్తుందని కూ వ్యవస్థాపకులు తెలిపారు. ఇది మీ ఇల్లు లాంటిది అంటూ కంగనను స్వాగతించారు.

కూ యాప్‌లో కంగన రనౌత్ ఫిబ్రవరిలో చేరారు. కూ వ్యవస్థాపకుల్లో మరొకరు మయాంక్ బిడవాట్కా కంగన రనౌత్‌కు స్వాగతం పలికి @kanganarofficial కంగన గారూ, ఇది మీ ఇల్లు. మీరు గర్వంగా మీ అభిప్రాయాలను ఇక్కడ తెలియచేయచ్చు అంటూ ఆమెను ఆహ్వానించారు. ట్విట్టర్ తన ఖాతాని నిలిపినందుకు బదులుగా సమాధానం ఇస్తూ, కంగనా అదృష్టవశాత్తూ తనకు చాలా వేదికలు ఉన్నాయని, తన కళకు సంబంధించిన సినిమా ద్వారా కూడా తాను ప్రజలతో తన భావాలను చెప్పచు అని అన్నారు. తన గళాన్ని అనేక వేదికల ద్వారా వినిపిస్తానని కంగనా చెప్పారు.

Share post:

Latest