అభిమానుల‌కు ఊర‌ట‌నిచ్చిన ఎన్టీఆర్‌..త్వ‌ర‌లోనే..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్ల‌డించారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని.. నేను బాగానే ఉన్నాన‌ని ఎన్టీఆర్ తెలిపాడు.

అయిన‌ప్ప‌టికీ, ఎన్టీఆర్ అభిమానులు క‌ల‌వ‌ర‌ప‌డుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఎన్టీఆర్.. ఈరోజు రంజాన్ పర్వదినం కావడంతో ముస్లింలకు సోష‌ల్ మీడియా ద్వారా ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే త‌న ఆరోగ్యంపై కూడా స్పందించి.. ఫ్యాన్స్‌కు కాస్త ఊర‌ట‌నిచ్చారు.

ఈ రోజు ఈద్ సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ.. నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన వారికి ధ‌న్య‌వాదాలు. ప్ర‌స్తుతం నా ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంది. త్వ‌ర‌లోనే నెగెటివ్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. ఇంట్లోనే ఉండండి జాగ్ర‌త్త‌గా ఉండండి ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నాడు.

Share post:

Latest