మ‌హేష్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న హీరోయిన్‌ కూతురు?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ చ‌త్రం త్వరలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేక‌ర్స్ భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే జాన్వీతో చిత్ర యూనిట్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి మ‌హేష్‌తో రొమాన్స్ చేసేందుకు జాన్వీ ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఒక‌వేళ జాన్వీ గ్రీన్ సిగ్నెల్ ఇస్తే.. తెలుగులో ఈమెకు ఇదే మొద‌టి సినిమా అవుతుంది.

Janhvi Kapoor - Wikipedia

Share post:

Latest