జపాన్ లో విజృంభిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్..?

గతేడాది నుండి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి రూపాంతరాలు చెందుతూ పలు దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు, నాలుగు వేలకు దగ్గరగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గి త్వరలో కరోనా థర్డ్ వేవ్ రాబోతోందని పలు కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి సమయంలో జపాన్ లో కరోనా ఫోర్త్ వేవ్ మొదలవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రస్తుతం జపాన్ దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. జపాన్‌ ప్రధాన నగరమైన ఒసాకాలో కరోనా ఉధృతి రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. జపాన్ లో కేవలం 90 లక్షల జనాభా మాత్రమే ఉంది. అక్కడ ఈ ఒక్క వారంలోనే 3,849 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీనిని బట్టి ఆ దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విజృంభణ ఏ విధంగా ఉందో అర్థం అవుతుంది. జపాన్‌ లో సంభవిస్తున్న కరోనా మరణాల్లో దాదాపు 25 శాతం మరణాలు ఒసాకా నగరంలోనే నమోదవుతుండటం గమనార్హం.

Share post:

Latest