ఐశ్వర్య రాయ్లా ఉన్న ఈ హీరోయిన్ ఎవరంటే..?

ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. జీవిత కాలంలో మనలా ఉన్న వారిలో ఇద్దరు ముగ్గురినైనా కలుస్తాం అని చెబుతుంటారు. కొంతమంది ప్రముఖులను పోలిన వారిని కూడా మనం చూస్తుంటాం. ఆ మధ్య విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా ఉన్న వారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా అందానికి ఎవరెస్టు గా చెప్పుకునే ఐశ్వర్యారాయ్ లాగా ఉన్న ఒక హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో కాదు. తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్.

స్నేహ ఉల్లాల్ ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. కానీ తెలుగులో ఈ హీరోయిన్ కి ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పుడూ తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పట్లో స్నేహా ఉల్లాల్ ను జూనియర్ ఐశ్వర్య అని అభిమానులు పిలిచేవారు. తాజాగా ట్రెడిషనల్ డ్రెస్ లో పెళ్లికూతురులా స్నేహ ఉల్లాల్ రెడీ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అందరూ ఐశ్వర్య రాయ్ కు జిరాక్స్ లా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.

Share post:

Popular