వ‌రుణ్ సందేశ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్..!

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుపరిచితం అయిన న‌టుడు వ‌రుణ్ సందేశ్. కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా అయ్యాడు వరుణ్. ఆ తరువాత బిగ్ బాస్ షోకి త‌న భార్య‌ వితికతో క‌లిసి అందరిని అలరించాడు. వ‌రుణ్ సందేశ్ ప్ర‌స్తుతం ఎం.ఎస్‌.ఆర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇందువ‌ద‌న అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఫ‌ర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి మాధవి ఆదుర్తి నిర్మాతగా చేస్తుంది.

తాజాగా ఈ మూవీకి సంబందించిన ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందువ‌ద‌న ఫ‌స్ట్ లుక్ పోస్టర్ లో హీరోహీరోయిన్ చాలా బోల్డ్‌గా కనిపించి అందరిని ద్రుష్టి ఆకట్టుకుంటున్నారు. వ‌రుణ్ సందేశ్ పాత హీరో శోభన్ బాబులా రింగుల జుత్తుతో న్యూ లుక్‌లో క‌నిపిస్తున్నారు. పోస్ట‌ర్‌ రిలీజ్ చేసి ఈ మూవీ పైమరింత ఆసక్తి పెంచుతున్నారు మేక‌ర్స్. ఈ చిత్రాన్ని 2021లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేక‌ర్స్.

Share post:

Latest