ఆ సినిమా రీమేక్ పై తమన్నా సంచలన నిర్ణయం…?

మిల్కీ బ్యూటీ తమన్నా అన్ని భాషల్లో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా, వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా అన్ని చేసేస్తోంది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ లు పలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. తమన్నా తెలుగులో కూడా చాలా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అంధాధున్‌’ సినిమాకు రీమేక్‌ గా తెలుగులో తెరకెక్కుతున్న ‘మాస్ట్రో’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్‌ నటిస్తోంది. అయితే ‘అంధాధున్‌’ హిందీ వెర్షన్ సినిమాలోని టబు పాత్రలో తమన్నా నటించబోతోంది. తాజాగా ఆ సినిమాపై తమన్నా కామెంట్స్ చేసింది. ‘అంధాధున్’ ఒరిజినల్​ వెర్షన్ ను చూడకూడదని డిసైడ్ అయినట్లు చెప్పింది. తెలుగులో తీస్తున్న సినిమాలో తాను కొత్తగా నటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం తమన్నా చేతిలో ఎఫ్ 3, సిటిమార్ లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి.

Share post:

Latest