వారికీ శింబు థ్యాంక్స్..!

తమిళ స్టార్ హీరో శింబు చాలా లేట్ గా ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతనికి ఫాలోయర్స్ మాత్రం వేగంగా పెరిగిపోతున్నారు. అతడిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 1 మిలియన్ కి చేరడంతో శింబు ఫ్యాన్స్ కి థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. శింబు తన అప్ డేట్స్ ని రెగ్యులర్ గా పోస్ట్ చేస్తే త్వరలోనే మరింత మంది ఫాలోయర్స్ పెరిగే అవకాశం ఉంది.

శింబు ‘ఈశ్వరన్’ అనే సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లో సందడి చేశారు. అనుకున్నంతగా ఆ సినిమా హిట్ కాలేదు. ఆ సినిమా తెలుగు వర్షన్ విడుదల కూడా కొన్ని కారణాలతో వాయిదా పడింది. ప్రస్తుతం శింబు ‘మానాడు’ సినిమాలో నటిస్తున్నాడు. చాలా కాలంగా విడుదల కాకుండా ఆగిన ‘మహా’ సినిమాలో శింబు గెస్ట్ రోల్ పోషించాడు. అలానే ‘ముఫ్తీ’ రీమేక్ ‘పాతు తలా’లో కూడా శింబు నటిస్తున్నాడు. అలానే గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనూ శింబు చేస్తున్న సినిమాకు ‘నాదిగలిలే నీరదమ్ సూర్యన్’ అనే టైటిల్ పెట్టబోతున్నారని టాక్ నడుస్తోంది.

Share post:

Popular