ఫ్యామిలీ మాన్ 2 ట్రైలర్ తేదీ ఖరారు..!

కరోనాతో థియేటర్లతో పాటు షూటింగ్‌లు మూతపడ్డాయి. దీంతో ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఇదే బాట పడుతున్నారు. తాజాగా అక్కినేని సమంతా తొలిసారి నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ రిలీజ్ కు రెడీ అయింది. కాగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కి సీక్వెల్ గా ఈ వెబ్ సిరీస్ రానుంది. మ‌నోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ లీడ్ రోల్స్ పోషించారు. దీనిని దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు తీశారు.

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ చిత్రీకరణ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమైంది. కానీ, పలుమార్లు స్ట్రీమింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ సిరీస్‌ను జూన్‌ నెలలో అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌ను మేనెల చివరి వారంలో విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌ ఈ సిరిస్ పై ఆసక్తిని చాలా పెంచేశాయి. ఈ మూవీలో సమంత టెర్రరిస్టు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share post:

Latest