క‌రోనా ఎఫెక్ట్‌..ఎన్టీఆర్ షో ఇక లెన‌ట్టే?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1కు హోస్ట్ వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఇటీవ‌ల ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

జెమిని టీవీలో ప్రసారం కానున్న ఈ షో.. మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. కానీ, క‌రోనా వ‌చ్చి అడ్డు ప‌డింది. ఇక మొన్న‌టి దాకా ఆగ‌స్టు నుంచి ఈ షో స్టార్ట్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ షో లెన‌ట్టే అన్న టాక్ ఊపందుకుంది.

ఎందుకంటే, క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతి ఇప్ప‌ట్లో త‌గ్గే ప‌రిస్థితి ఏ మాత్రం క‌నిపించ‌డం లేదు. అందుకే ఈ ఏడాది పూర్తిగా షో నిలిపివేయాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

Share post:

Latest