పుష్ప ఐటెం సాంగ్ లో దిశా పటాని…?

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న “పుష్ప” రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్లు ఇటీవల ఆ సినిమా ప్రొడ్యూసర్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా స్మగ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట. అయితే ఆ ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా ప‌టానీ అల్లుఅర్జున్ సరసన స్టెప్పులేయనుందని టాక్ నడుస్తోంది. ఈ విషయంపై పుష్ప టీం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న ఇంకా రాలేదు.

పుష్ప సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో దిశా ప‌టానీ ఐటమ్ సాంగ్ లో కనిపిస్తే హిందీ వెర్షన్ లో సినిమాకు ప్లస్ అవుతుంది. యూత్ లో దిశా ప‌టానీకి ఎక్కువగా క్రేజ్ ఉండటంతో ఆమెతోనే ఐటెమ్ సాంగ్ చేయిస్తే బాగుంటుందని అల్లుఅర్జున్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.